Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టే రాజకీయాలలో కూడా మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికలలో పోటీ చేసే 100% స్ట్రైక్ రేట్ సంపాదించారు.
ఇలా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో దోహదం చేస్తూ సంచలనంగా మారారు ఇక పవన్ కళ్యాణ్ విజయంతో కేవలం రాష్ట్రస్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నాయకుడిగా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ ను ఎంతోమంది స్వాగతించగా మరికొందరు మాత్రం ఈయన సక్సెస్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా ప్రముఖ నిర్మాత చిట్టిబాబు సైతం పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ఇటీవల వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయాలకు సెలవు ప్రకటిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ రాజీనామా వెనుక పవన్ కళ్యాణ్ దెబ్బ ఉందని ఆయన కారణంగానే విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేశారనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే అంశం గురించి ఒక యూట్యూబ్ ఛానల్ లో పాల్గొన్నటువంటి చిట్టిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు.
విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడానికి పవన్ కళ్యాణ్ కారణమని, ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. పవన్ దెబ్బ ఏముందని.. లోకేష్ దెబ్బకు పవన్ ఎలా గిలగిల్లాడతారో తెలియదన్నారు. లోకేష్, జగన్ మధ్య పవన్ ఎలా నగిలిపోతారోనన్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. రోజుకొక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అయ్యారని చిట్టిబాబు విమర్శించారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కనుక ఆయన పవర్ ఫుల్ జోకర్ అంటూ చిట్టి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకసారి సీజ్ చేసిన షిప్పును క్షమాపణలు చెప్పించుకోవడం కోసం ఈయన మరోసారి వెళ్లి సీజ్ ది షిప్ అనే మాటలు మాట్లాడుతూ జోకర్ అవుతున్నారు అంటూ చిట్టి బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.