విడిపోయి మళ్ళీ అదే వ్యక్తిని పెళ్లాడిన ఒకప్పటి స్టార్ హీరోయిన్

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు సినిమా ఇండస్ట్రీ లో చాలా విడిపోయాయి. అమల పాల్, సమంత, ధనుష్ లాంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని, కొన్నాళ్ళకి ఏవేవో కారణాల వల్ల విడిపోయారు. కానీ ఒక నాటి హీరోయిన్ భర్త నుండి విడిపోయి, మళ్ళీ కొన్నాళ్ళకు అతన్నే మళ్ళీ పెళ్లి చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే తెలుగు, తమిళ్ లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న ప్రియా రామన్ 1999లో తమిళ నటుడు అయిన రంజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియా రామన్.  ఒక సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

కానీ  పెళ్లయి నాలుగేళ్లు తిరగకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రంజిత్ కి విడాకులు ఇచ్చింది ప్రియ. ఇక రంజిత్ సైతం ఆ తర్వాత రాగ సుధా అనే మరో నటిని పెళ్లాడాడు. ఈ జంటకి ఒక కూతురు కూడా పుట్టింది.

అయితే సడన్ గా  ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ 2018లో ప్రియ – రంజిత్ మరోమారు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. డబ్బు కారణంగానే ఇద్దరు విడిపోయినట్టు, విడాకులు తన వ్యక్తిగత నిర్ణయమని ప్రియా రామన్ ఇంటర్వ్యూల్లో తెలిపింది.