వింక్ గర్ల్ పేరుతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్ను గీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ‘ఓరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి తెలుగులో మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. యువ హీరోలు, డెబ్యూ హీరోల సినిమాల నిర్మాతలు ఈమెను అప్రోచ్ అయ్యారు. కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడంతో ఇండస్ట్రీ సంగతి పెద్దగా పట్టలేదు ఈ అమ్మాయికి. ఇంకేముంది గుమ్మం దగ్గరకు వచ్చిన నిర్మాతలకు రెమ్యునరేషన్ పేరుతో షాకిచ్చింది.
మూడు నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్ తరహాలో భారీ మొత్తంలో ఆశించింది. ఆదిలోనే ఆమె అత్యాశను చూసి ఖంగుతిన్న నిర్మాతలు నమస్తే చెప్పేసి వెనక్కి వచ్చారు. అది మొదలు తెలుగులో ఒక సినిమా పట్టుకోవడానికి ఆమెకు ఏడాదికి పైగానే సమయం పట్టింది. ఎలాగోలా నితిన్ ‘చెక్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలో ప్రియా ప్రకాష్ స్క్రీన్ ప్రెజెన్స్ సైతం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తన గురించ్ని ఏదేదో ఊహించుకున్న ఆమెకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. ఆఫర్లు క్యూ కట్టి వస్తాయని అనుకుంటే బొత్తిగా తగ్గిపోయాయి. ప్రజెంట్ ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదీ చిన్న సినిమానే. అది గనుక అటూ ఇటూ అయితే అమ్మాయిగారు కెరీర్ ఇంకాస్త డౌన్ కావడం ఖాయం.