ప్రియ వికెట్ పడిందహో.. కానీ, ఎందుకు.?

Priya Gets Eliminated But Why | Telugu Rajyam

ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన విషయంలో మొదటి నుంచీ గందరగోళంతో కూడిన ఎలిమినేషన్లే జరుగుతున్నాయి. వాస్తవానికి, రెండో సీజన్ నుంచే ఈ పైత్యం పతాక స్థాయికి చేరింది. అలాగని మొదటి సీజన్ ఏదో పద్ధతిగా జరిగిందని కాదు. అప్పుడూ అంతే.

ఐదో సీజన్ పరిస్థితి మరీ దారుణం. హౌస్‌లో అవసరమైనోళ్ళు వుండటంలేదు.. అవసరం లేనోళ్ళు వుంటున్నారు. ప్రియ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన కంటెస్టెంట్. లహరి, హమీదా, సరయు.. హౌస్‌లో కొన్నాళ్ళు వుండాల్సినోళ్ళే.

ఐదో సీజన్ విషయానికొస్తే, సీనియర్ నటి ప్రియ.. తన స్థాయికి తగని పనులు చాలా చేసింది. రవి మాటల్ని నమ్మేసి లహరి విషయంలో దారుణమైన కామెంట్స్ చేయడం, సన్నీని రెచ్చగొట్టడం.. ఇవే ఆమె హౌస్‌లో వెలగబెట్టిన వ్యవహారాలు. కాదు కాదు, బిగ్ బాస్ మనకి చూపించిన వ్యవహారాలు.

హౌస్‌లో ఇరవై నాలుగ్గంటలపాటు సుమారు డెబ్భయ్ కెమెరాలు ఏమేం సన్నివేశాల్ని చిత్రీకరిస్తాయోగానీ.. అందులో బిగ్ బాస్ తనక్కావాల్సిన కంటెంట్ మాత్రమే తీసుకుని చూపిస్తాడు. అదే అసలు సమస్య. మొత్తానికి ప్రియ ఔట్ అవడంతో, బిగ్ హౌస్‌లో కొంత ప్రశాంత వాతావరణం వుంటుందనే అభిప్రాయానికి వచ్చేశారు వీక్షకులు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles