SSMB 29: ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమా 2023 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ డైరెక్షన్ లో తెరికెక్కిన ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో సక్సెస్ ను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో పృధ్విరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఏకంగా ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పాల్గొన్న ఈయనకు సలార్ 2 గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులని పూర్తి అయ్యాయని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు.
ఇలా ఈ సినిమా పూర్తి కాగానే తిరిగి సలార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుంది అంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోయే సినిమా షూటింగ్ జరుగుతోందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత కొంతకాలంగా ఈయన మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమాల్లో కూడా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తల గురించి కూడా పృథ్విరాజ్ సుకుమారాన్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నాకంటే బాగా అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఇంకా ఇది ఫైనల్ కాలేదు ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది అంటూ పృధ్విరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే దాదాపు ఈ సినిమాలో ఈయన ఫైనల్ అయ్యేలా ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.