దేశ రాజకీయాలను ఏలుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. ఆయన కనుసన్నల్లో కదులుతున్న రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ, కేవలం ఒక ఏడాదిన్నర కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగిన ఆధారాలను కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో దేశంలో మోడీ హవా పూర్తిగా తగ్గనుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
మోడీపై ప్రజల్లో తగ్గిన నమ్మకం
2019 ఎన్నికల తరువాత ప్రజలు మెల్లమెల్లగా మోడీ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై, మోడీపై నమ్మకం కోల్పోయారని సమాచారం. ఇందుకు రెండు కారణాలను ప్రతిపక్ష పార్టీల నాయకులు చూపిస్తున్నారు. ఒకటి బీహార్ ఎన్నికలు, రెండవది అమెరికా ఎన్నికలు. బీహార్ ఎన్నికల్లో మొదట రెండు దశల్లో నితీష్ కుమార్ మోడీ కార్డ్ ను విపరీతంగా వాడుకున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని గురించి కూడా చెప్పుకోకుండా కేవలం మోడీ పేరును జపిస్తూ ప్రచారం చేశారు. కానీ అక్కడ మోడీ జపం ఫలించలేదని తెలుసున్న నితీష్ కుమార్ ఇప్పుడు కొత్త మంత్రాన్ని జపిస్తున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, కాబట్టి తనను గెలిపించాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎందుకు నితీష్ ఇలా సడెన్ గా మోడీ జపాన్ని వదిలారంటే రెండు దశల్లో మోడీ వల్ల ఓట్లు తగ్గాయని భావించే మోడీ పేరును వాడటం ఆపేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మోడీని నమ్ముకొని నష్టపోయిన ట్రంప్
అమెరికా ఉన్న భారతీయులను ఓట్లను పొందటనికి ఈ సంవత్సరం మొదట్లోనే డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సభలో ట్రంప్ మాట్లాడుతూ తనకు మోడీ మంచి మిత్రుడని, రానున్న రోజుల్లో ఇండియా-అమెరికాల స్నేహానికి మరింత కృషి చేస్తామని తెలిపారు. అలాగే మోడీ కూడా రానున్న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి ట్రంప్ ఓడిపోయారు. మోడీ చెప్పడం వల్లే అమెరికాలో ఉన్న భారతీయులు ట్రంప్ కు ఓట్లు వేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయాలన్ని నిజమైతే రానున్న రోజుల్లో దేశంలో కూడా మోడీకి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.