ఆ ధైర్యం ఎక్కడిది ప్రశాంత్ నీల్ ?

Prashanth Neel pin hopes on July 16th
Prashanth Neel pin hopes on July 16th
 
లాక్ డౌన్ మూలంగా ఎన్నో పెద్ద సినిమాల విడుదలలు సందిగ్ధంలో పడిపోయాయి. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చేప్పలేని పరిస్థితి. షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ కారణాలతో పెద్ద సినిమాల వాళ్ళు విడుదల మాటే ఎత్తట్లేదు. కనీసం అప్డేట్స్ కూడ ఇవ్వట్లేదు. ఇంతటి సందిగ్ధంలో కూడ ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్-2’ విడుదల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రాన్ని జూలై16వ విడుదల చేస్తామని అంటున్నారు.అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడ వెనక్కి వెళ్తుందనే ఆలోచనలోనే ఉన్నారు ప్రేక్షకులు.  
 
అయితే ప్రశాంత్ నీల్ బృందం మాత్రం నిన్న రిలీజ్ చేసిన పోస్టర్లో సెకండ్ చాప్టర్ జూలై 16 నుండి కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.  దీంతో చిత్ర టీమ్ జూలై 16కే ఫిక్స్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది.  మరి ప్రశాంత్ నీల్ టీమ్ అనుకుంటున్నట్టు జూలై నాటికి పరిస్థితులు చక్కబడుతాయా అనేదే పెద్ద సందేహం. దేశంలో కరోనా కేసులు తగ్గాయి కానీ పూర్తిగా అదుపులోకి రాలేదు. త్వరలో థర్డ్ వేవ్ కూడ ఉంటుందని అంటున్నారు. పరిస్థితుల నడుమ థియేటర్లు తెరుచుకుంటాయని ఎవ్వరూ ఆశలు పెట్టుకోవట్లేదు. అలాంటిది ప్రశాంత్ నీల్ టీమ్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.