అందుకే ఎప్పుడు ఎక్కడా వినని ” సలార్ ” అన్న టైటిల్ ని ప్రభాస్ సినిమాకి పెట్టాడు ప్రశాంత్ నీల్ ..!

ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్స్ ని కమిటయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా కంప్లీటవగానే ఆదిపురుష్ ని మొదలు పెడతారని ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో ప్రభాస్ .. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాని అనౌన్స్ చేసి షాకిచ్చాడు. చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరూ ఊహించలేదు. తాజాగా ప్రకటించిన ఈ సినిమా విషయంలో అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ఇండస్ట్రీ వర్గాలలోను ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

Adipurush': Prabhas joins Om Raut for multilingual 3D action movie |  NewsBytes

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ని కేజీఎఫ్ తో పాన్ ఇండియన్ స్టార్ గా మార్చిన ప్రశాంత్ నీల్. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ సౌత్ లో అంతటి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ని తీస్తున్న ప్రశాంత్ నీల్ బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నాడు. హీరో యష్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజత్ దత్ మీద క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడు. ఈ క్లైమాక్స్ తో కెజీఎఫ్ 2 కంప్లీట్ అవుతుంది.

దాంతో వెంటనే ప్రభాస్ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాని తాజాగా ప్రకటించి ప్రభాస్ లుక్ తో పాటు సలార్ అన్న టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ లుక్ తో పాటు ఈ సినిమాకి పెట్టిన టైటిల్ కి మీనింగ్ ఏంటో అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలలో కూడా చాలామంది వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ టైటిల్ కి అర్థం నాయకుడు అని. సలార్ అన్న ఉర్దూ పదాన్ని టైటిల్ గా పెట్టడం కోసం మేకర్స్ చాలా ఆలోచించారట.

KGF Director Next Movie Salaar With Prabhas - NewsBust.in

అయితే ప్రశాంత్ నీల్ రాసుకున్న కథ రిత్యా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర రిత్యా ఎలాంటి టైటిల్ పెట్టినా వెయిట్ కనిపించిన లేదట. వినడానికి కొత్తగా అనిపించాలి.. సౌండ్ తో పాటు టైటిల్ ఆసక్తి గా ఉండాలని చాలా టైటిల్స్ అనుకొని సలార్ అన్న టైటిల్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుండగా ప్రభాస్ డాన్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు.