కెజిఎఫ్ 2′ దర్శకుడికి ఇంజెక్షన్ అంటే ఎంత భయం !

Prashanth Neel closes his eyes while taking vaccine
Prashanth Neel closes his eyes while taking vaccine
ఈమధ్య కాలంలో దక్షిణాది ప్రేక్షకులు చూసిన భీభత్సమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కెజిఎఫ్’. మాస్ జనాలని ఒక ఊపు ఊపింది ఈ చిత్రం. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ అన్ని భాషల ఆడియన్స్ సినిమాలోని యాక్షన్ కంటెంట్ చూసి ఆశ్చర్యపోయారు. భారీ స్థాయిలో హీరో ఎలివేషన్స్, భీభత్సమైన ఫైట్స్, వైల్డ్ సెటప్, గుండెల్లో దడ పుట్టించే బిజీఎమ్ ప్రతిదీ హైలెట్ అయింది.
 
ఈ స్థాయిలో భీభత్సాన్ని, హీరోయిజాన్ని ఆన్ స్క్రీన్ మీద చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకి హీరోలా కనిపించాడు చూడటానికి సాఫ్ట్ గా ఉండే ప్రశాంత్ నీల్ లోపల ఇంత విపరీతం ఉందా అని ఆశ్చర్యపోయారు. 
 
అలాంటి ప్రశాంత్ నీల్ కూడా భయపడ్డాడు. అది కూడ ఒక ఇంజెక్షన్ కు కావడం ఇక్కడ కొసమెరుపు.  ప్రశాంత్ నీల్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సినిమాల్లో ఎంతో వయోలెన్స్ క్రియేట్ చేసి దడ పుట్టించే ప్రశాంత్ నీల్ చిన్న ఇంజెక్షన్ కు ఇంతలా భయపడ్డాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. తన హీరోల చేత వందల మందిని చితగ్గొట్టిస్తూ చూసే వాళ్లను ఊపిరిబిగబట్టేలా చేసే బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ ఇలా చిన్న సూదికి కళ్ళు మూసేయడం విడ్డూరమే మరి.