ప్రభాస్ పై కోపంగా ఉన్న ప్రశాంత్ నీల్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్, KGF  తో ప్రశాంత్ నీల్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చాలా శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మీద ప్రశాతం నీల్ తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’  తో పాటు ‘ఆదిపురుష్’ ‘ప్రాజెక్ట్ కే’ వంటి సినిమాలు చేస్తున్నాడు.

మూడు సినిమాలు చెయ్యడం వల్ల ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి..ఒక్కో సన్నివేశం లో ఒక్కోలాగా కనిపిస్తున్నాడట. దీనిపై ప్రశాంత్ నీల్ కొంచెం సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.

ఇంతకముందు కూడా ప్రభాస్ ‘అడవి రాముడు’, ‘వర్షం’, ‘మున్నా’, ‘యోగి’, ‘రెబెల్’, ‘మిర్చి’ లాంటి సినిమాలు ఒకేసారి చేసాడు. ఆ సినిమాల్లో కూడా ప్రభాస్ లుక్స్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి.

దీని వల్ల ఆ రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ‘సలార్’ నెక్స్ట్ షెడ్యూల్ చేద్దామని ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చెప్పినట్టు తెలుస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు.