రాహుల్ గాంధీ-ప్రశాంత్ కిషోర్ భేటీ !

Prashant Kishor meets Congress leader Rahul Gandhi in Delhi

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఫ్రంట్ ఏర్పడుతుందని, కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మరికొంత మంది నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రాహుల్‌ను పీకే కలిశారని ఓ వైపు వాదనలు వినిపిస్తున్నాయి.

Prashant Kishor meets Congress leader Rahul Gandhi in Delhi

కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని పీకే ప్రశంసించడం, భవిష్యత్ నేత రాహులేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలు కొన్ని కొద్ది రోజులుగా ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలో ఇప్పటికే మూడుసార్లు సమావేశం అయ్యారు. పీకే కొంత కాలంగా బీజేపీయేతర పక్షాలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో తరుచూ సమావేశమవుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో పీకే చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.