హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ద్వార హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. తెలుగు, కన్నడ , తమిళ్, హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన ప్రణీత అత్తారింటికి దారేది సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు.
దీంతో ప్రణీత సినిమాలకు దూరంగా ఉంటూ 2021 మే 30 వ తేదీన బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత ఇటీవల జూన్ 10 వ తారీఖున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రణీత డెలివరీ సమయంలో డాక్టర్ అయిన తన తల్లి జయశ్రీ కూడ తన ప్రసవ సమయంలో ఎంతో సహాయం చేసిందని ప్రణీత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రణీత తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
మా అమ్మకి నా ప్రశంశలు. ప్రతి కూతురికి గైనకాలిజిస్ట్ అయిన తల్లి ఉండటం చాలా అవసరం అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. ఒక తల్లి తన సొంత కూతురికి ప్రసవం చేయటం అంత సులభమైన పని కాదు. కానీ నా ప్రసవ సమయంలో మా అమ్మ నాకు చాలా ప్రశాంతమైన అనుభూతిని కలిగించింది. ఒక డాక్టరు వ్యక్తిగత విషయాల కన్నా వృత్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. కొన్ని సమయాల్లో అమ్మ ఆసుపత్రికి అర్జెంట్ గా ఎందుకు వెళ్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి పేషంట్ బాధ్యత ఆమె చేతుల్లోనే ఉంటుంది అని నాకు ఇప్పుడు తెలిసింది అంటూ ప్రణీత చాలా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.