బ్రేకింగ్.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Pranab Mukherjee, former President of India, dies at 84

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కంటోన్మెంట్ లో ఉన్న ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

Pranab Mukherjee, former President of India, dies at 84
Pranab Mukherjee, former President of India, dies at 84

తన తండ్రి ఇక లేరని.. ప్రణబ్ కొడుకు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెల 10 వ తేదీన ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయసు ప్రస్తుతం 84 ఏళ్లు. ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో.. డాక్టర్ ఎంతో ప్రమాదకరమైనప్పటికీ.. ఆయన క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు.

అదే సమయంలో ప్రణబ్ కు కరోనా వచ్చింది. వెంటనే కరోనా చికిత్స కూడా ప్రణబ్ కు డాక్టర్లు అందిస్తూ వచ్చారు. అయితే.. సోమవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రిలోనే కన్నుమూశారు.

1935 డిసెంబర్ 11న ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ లో జన్మిచారు. ఆయన సొంతూరు మిరాటి. ప్రణబ్ తండ్రి కేకే ముఖర్జీ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రణబ్.. సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు, ఒక కూతరు ఉన్నారు. ప్రణబ్ భార్య సువ్రా.. 2015లోనే కన్నుమూశారు.

50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం

భారతదేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయనకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన్ను అందరూ ప్రణబ్ దా అని పిలుస్తుంటారు.

ప్రణబ్ ముఖర్జీని 2019లో భారతరత్న అవార్డు వరించింది. 2018లో పద్మవిభూషణ్ పురస్కారం, 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఆయన అందుకున్నారు.