సినిమా ఇండస్ర్టీ తరపున తన వంతుగా పవన్ కళ్యాణ్ చేసిన భారీ ప్రసంగం అనేక రకాల వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో మెగా కాంపౌండ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
ఈ వివాదానికి సంబంధించి ఒక్క మెగా హీరో కూడా బయటికి వచ్చి స్పందించింది లేకపోగా, మరోవైపు, ‘మా’ ఎలక్షన్స్ విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్‌లలో మెగా కాంపౌండ్ నుండి ఫుల్ సపోర్ట్ తనకే ఉందంటూ ప్రకాష్ రాజ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు తప్ప, డైరెక్టుగా ఎవ్వరూ ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేసింది లేదు ఇంతవరకూ.
ఇదిలా ఉంటే, మంచు విష్ణు ప్యానెల్ తరపున మోహన్ బాబు చాలా యాక్టివ్‌గా వ్యూహాలు పన్నుతున్నారు. కామ్‌గా చక్కబెట్టాల్సిన వ్యవహారమంతా తెర వెనక నుంచే చక్కబెట్టేస్తున్నారు. దాంతో మంచు విష్ణు గెలవడానికే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, మా అసోసియేషన్ అంతర్గత అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది ఎవ్వరికీ తెలీదనుకోండి.
ఇదిలా ఉంటే, ఎవరెవరికైనా ఓటేసుకోండి. కానీ, జనరల్ సెక్రటరీ ఓట్లు మాత్రం నాకే వేయండి.. అంటూ బండ్ల గణేష్ తను చేయాల్సిన పని తాను చేసుకుపోతున్నాడు. సో జనరల్ సెక్రటరీగా బండ్ల గణేష్ గెలవడానికీ అవకాశాలు బాగానే ఉన్నాయంటున్నారు. చూడాలి మరి ఉత్కంఠగా సాగుతోన్న ‘మా’ ఎలక్షన్స్‌లో గెలిచేదెవరో. ఓడేదెవరో.