Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ముఖ్యంగా రాజకీయ అంశాల గురించి ఈయన మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తరచూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ సినీ నటుడు విజయ్ దళపతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ చెన్నై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు ఉపముఖ్యమంత్రి ఉదయినిది స్టాలిన్ ని కలిశారు. ఇలా వీరిని కలిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ అలాగే విజయ్ దళపతి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారని ఆయనకు మెగా అభిమానులే కార్యకర్తలుగా ఉన్నారు తప్ప ఇతరులు లేరని తెలిపారు.
విజయ్ కూడా తమిళ్‌లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి మాట్లాడింది లేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చే సుమారు 10 సంవత్సరాలు అవుతుంది అయితే ఈయనకు దీర్ఘ దృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన ఏమాత్రం లేదని తెలిపారు. మరోవైపు విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా వీరిద్దరిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.