Prakash Raj: సనాతన ధర్మాన్ని కాపాడటానికి పవన్ ఎవరు… మరోసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్!

Prakash Raj: ఇటీవల కాలంలో నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తరుచు తన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో తరచూ ఇదే విషయం గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.పవన్ కల్యాణ్ ఇటీవల చెబుతున్న సనాతన ధర్మం..సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశాలపై అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అసలు పవన్‌కి ఒక విజన్‌ అంటూ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల గురించి ఎంతో క్లారిటీతో ఉన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఇప్పుడేమో సనాతన రక్షకుడినంటూ మతం రంగు పూసుకున్నారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కాపడాటానికి పవన్ ఏవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎందుకు సమయం వృధా చేస్తున్నారని ఈయన ప్రశ్నలు వేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి.

నిరుద్యోగ యువత ఆడపిల్లలపై అత్యాచారం జరుగుతున్నాయని.. అవినీతి పెరిగిపోయిందని తెలిపారు. వీటి గురించి పట్టించుకోవడం వదిలేసి సనాతన్‌ రక్షక్‌ అంటే ఎవడికి ఉపయోగం ? అని ప్రకాశ్‌ రాజ్‌ నిలదీశారు. అయినా రోజుకో రంగు బట్టలు ధరించడానికి ఇదేమి సినిమా కాదు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చకపోతే అధికారంలో ఉండి ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు. తిరుపతి లడ్డు విషయంలో కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటూ ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.