Pawan Kalyan – Prakash Raj: ఛీ.. ఛీ ఇంత దారుణమా.. పవన్ పై మరోసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్?

Pawan Kalyan – Prakash Raj: సినీ నటుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ తరచూ విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు గురించి వివాదం జరిగిన సమయం నుంచి ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసే పోస్టులు సంచలనంగా మారాయి. ఇలావీరిద్దరి మధ్య తరచూ వివాదం నెలకొంటూనే ఉంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్ రాజ్ స్పందించారు. ది రాజ్యభాష అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు.” ఈ రేంజ్ కు అమ్ముకోవడమా ఛీ.. ఛీ #just asking” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని జత చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కొందరు పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ విమర్శలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయనను రాజకీయ ప్రేరణతో మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. గతంలోనూ ప్రకాశ్ రాజ్ అనేక సందర్భాల్లో పవన్ రాజకీయాలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజా ట్వీట్‌తో మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగేలా కనిపిస్తోంది. అయితే గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ హిందీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు హిందీ గో బ్యాక్ అంటూ ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.

ఇలా ఒకప్పుడు హిందీని గో బ్యాక్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం హిందీ భాష మనకు పెద్దమ్మ లాంటిది అంటూ నీతులు చెప్పడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.