Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇలా జనసేన పార్టీని ప్రారంభించిన ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ మాట్లాడటంతో పలువురు విమర్శలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చోటుచేసుకుంది.
ఇకపోతే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, బిజెపి అనుకూల వైఖరుల పైన కూడా పలు రకాల విమర్శలు చేయడం జరిగింది. చేగువేరా, గద్దర్ బిజెపి పార్టీకి అసలు సంబంధం ఏంటి ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి కనీసం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వీరందరూ కూడా బిజెపి సిద్ధాంతిక వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేశారని.. ఇప్పుడు వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని తెలిపారు.
ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నది హిందూ ధర్మం కాదని సనాతర ధర్మం కూడా కాదని ప్రమాదంలో ఉన్నది బీజేపీ పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన ఈయన బిజెపి పార్టీ విధి విధానాలను అనుసరిస్తూ చేసే వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు మండిపడ్డారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి మరోసారి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.. ఇక నటన పరంగా వీరిద్దరూ మంచి మిత్రులు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి కానీ రాజకీయాలలో మాత్రం వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోతున్నారని చెప్పాలి.