Pragathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను అందరి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తన వర్కౌట్స్ కు సంబంధించిన విషయాలను, వీడియోలను షేర్ చేస్తూ శరీర ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే శరీర ఫిట్నెస్ కి సంబంధించిన ఎన్నో వీడియోలను షేర్ చేసిన ప్రగతి తాజాగా మరొక ఫోటోని షేర్ చేశారు.
ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎంతో బిజీగా ఉండే ప్రగతి తాజాగా తన జిమ్ ట్రైనర్ తో కలిసి విన్యాసాలు చేసింది.ఈ క్రమంలోనే ఈ విన్యాసాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో భాగంగా తన జిమ్ ట్రైనర్ ను ప్రగతి ఆంటీ తన కాళ్ళపై నిల్చోబెట్టుకుంది.ఈ విధంగా తన జిమ్ ట్రైనర్ నిలబడినపుడు ప్రగతి ఎలాంటి సపోర్ట్ లేకుండా గోడకు ఆనుకొని మోకాలిపై కూర్చోవడం విశేషం.
ఈ విధంగా జిమ్ ట్రైనర్ తో ప్రగతి చేసిన ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు కుర్రకారులు ముక్కున వేలు వేసుకున్నారు. ఇలా ప్రగతి షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ప్రగతి ఆంటీ స్టామినా మామూలుగా లేదుగా… ఎంతైనా మీరు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా నెటిజన్లు ప్రగతి శక్తి సామర్థ్యాలపై కామెంట్లు చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.