భారీ సక్సెస్ అందుకున్న ప్రదీప్ సర్కార్ సీజన్ 2 !

ప్రదీప్ మాచిరాజు బుల్లితెర వ్యాఖ్యాత ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఆయన హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా వెండితెర ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ ప్రస్తుతం ఆహా ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ సీజన్ 2 ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా సెలబ్రెటీలను ఎంతో కఠినమైన ప్రశ్నలు అడుగుతూ వారితో ఓ రేంజ్లో వాడుకుంటున్నారు. ఈ విధంగా ప్రదీప్ ఆటపాటలతో సెలబ్రిటీలను ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్కార్ సీజన్ 2 కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. మొట్టమొదటి తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ అయినా ఆహా వేదికగా పలు టాక్ షోలు ప్రసారం అవుతూ మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇదివరకే సర్కార్ సీజన్ 1 మంచి విషయాన్ని అందుకోగా… సీజన్2 కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ప్రదీప్ బుల్లితెరపై ఢీ డాన్స్ షో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే ఈ నెల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ద్వారా హీరోగా పరిచయం కాగా, మరొక సినిమా ద్వారా వెండితెరకు ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు.