Pradeep Machiraju: త్వరలో పెళ్ళిప్పీటలు ఎక్కబోతున్న ప్రదీప్…. అమ్మాయి ఎవరంటే?

Pradeep Machiraju: తెలుగు ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ లో మొదటగా గుర్తుకు వచ్చే పేరు ప్రదీప్. ఇండస్ట్రీలో ప్రదీప్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్స్ ఉన్నప్పటికీ ఫిమేల్ యాంకర్స్ లో సుమ కనకాల, మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజును ఎవరూ రీప్లేస్ చేయలేరు. ప్రదీప్ తన పంచులతో, కామెడీ టైమింగ్ తో, యాంకరింగ్ తో ఎంతోమందిని అభిమానులుగా చేసుకున్నాడు. ప్రదీప్ ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. జీ తెలుగు లో ప్రసారమైన” కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రొడ్యూసర్ గా కూడా మారాడు.

ఈ ప్రోగ్రాం వల్ల ఇండస్ట్రీలో ప్రదీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రాంకి కూడా ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక రేడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ ప్రస్తుతం యాంకర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రదీప్ ఏ షో లో కనిపించినా ఆయన పెళ్లి గురించిన విషయం ఖచ్చితంగా ప్రస్తావన వస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రదీప్ పెళ్లి గురించిన వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ప్రదీప్ తొందర్లోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని, ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమార్తె అన్న వార్త ప్రస్తుతం బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పటవరకూ సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్తల గురించి ప్రదీప్ స్పందించలేదు. అయితే ప్రదీప్ పెళ్లి కి సంబంధించిన ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.