Spirit: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. హను రాఘవపూడి ఫౌజీ తర్వాత ఇమ్మీడియట్ గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసారు సందీప్ రెడ్డి వంగా.
అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైమ్ లో పూర్తి చేయాలని చూస్తున్నారట. స్పిరిట్ రీ రికార్డింగ్ 70 శాతం పూర్తి అయ్యింది అని చెప్పి షాక్ ఇచ్చారు సందీప్.అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి ఆర్నెళ్లలో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 30 శాతం BGM సిద్ధం చేస్తానని రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందని అంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివర్లో గానీ 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
Spirit: ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్డేట్.. సంబరాలు చేసుకుంటున్న డార్లింగ్ ఫాన్స్!
