Prabhas : బిగ్గెస్ట్ హాలీవుడ్ బ్యానర్ లో ప్రభాస్?దీనిపై అసలు కథ ఏంటో తెలుసుకోండి!

Prabhas :  ఇప్పుడు నో డౌట్ గా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ఎవరు అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే అంటారు అంతా. అయితే తనకి బాహుబలి లాంటి రెండు భారీ హిట్స్ వచ్చినా ఆ తర్వాత మాత్రం రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ ప్లాప్ లు తప్పలేదు.
అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో మాత్రం ప్రభాస్ క్రేజ్ ఇంకా పదిలంగానే ఉంది.
అయితే ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పట్ల ఎప్పుడు నుంచో అనేక ఆసక్తికరమైన ఊహాగానాలు ఉండగా లేటెస్ట్ గా సినీ వర్గాలని ఓ టాక్ కుదిపేస్తుంది. ప్రభాస్ ని ఏకంగా హాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ అయినటువంటి “యూనివర్సల్ మీడియా” వారు టచ్ లో ఉన్నారని ఒక నెవర్ బిఫోర్ భారీ స్కేల్ సినిమాని ప్లాన్ చేస్తున్నారని షాకింగ్ రూమర్స్ ఒక్కసారిగా సంచలనం రేపాయి.
అయితే అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. నిజానికి అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఇది కేవలం ప్రభాస్ పేరును మళ్లీ లేపడానికి ఫ్యాన్స్ చేసిన ఒక క్రేజీ యత్నమే తప్ప ప్రభాస్ హాలీవుడ్ లో సినిమా చేయడం అనేది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కొన్ని పాన్ ఇండియా సినిమాలు వరల్డ్ లెవెల్లో అయితే నాగ్ అశ్విన్ తో చేస్తున్న “ప్రాజెక్ట్ కె” మాత్రమే ఉంది తప్ప వేరే ఏ సినిమాలకి ప్రభాస్ కమిట్ అవ్వలేదట. ఇదే ప్రభాస్ హాలీవుడ్ నిర్మాణ సంస్థ తో చేయబోయే సినిమా వెనుక ఉన్న అసలు కథ.