ప్రభాస్ సైతం విసుగెత్తిపోయాడా ?

Prabhas ultimatum to his directors
Prabhas ultimatum to his directors
మన స్టార్ హీరోల్లో ఏమాత్రం హడావుడి పడకుండా చాలా తాపీగా సినిమాలు చేసే హీరోల్లో ప్రభాస్ ఒకరు.  ప్రభాస్ ఎప్పుడూ కూడ సినిమాలను కంప్లీట్ చేయడానికి తొందరపడలేదు. దర్శకులకే స్వీట్ టైమ్ ఇచ్చేసేవారు.  కానీ ఇప్పుడు పద్దతి మార్చారు ప్రభాస్. ఆయన కూడ విశ్రాంతి తీసుకుని తీసుకుని విసిగిపోయారో ఏమో కానీ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలకు ఒప్పుకుని ఉన్నారు. వాటిలో రెండు ‘సలార్, ఆదిపురుష్’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.  
 
ఇవి కాకుండా నాగ్ అశ్విన్ సినిమా ఒకటి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే మరొకటి ఒప్పుకుని ఉన్నారు.  అంటే మొత్తంగా నాలుగు సినిమాలు. జరుగుతున్న రెండు సినిమాలు ఆలస్యం అవుతూ ఉండటంతో మిగతా రెండు సినిమాలు కూడ వెనక్కి వెళుతూనే ఉన్నాయి. దీంతో ఆయన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటున్న నిర్మాతలు, దర్శకులు కూడ ఆలోచనలో పడ్డారు.  ప్రభాస్ డేట్స్ ఇచ్చినా ఇంకో రెండు మూడేళ్లు ఎదురుచూడాలి కాబట్టి వెనక్కు తగ్గుతున్నారు.  ప్రభాస్ తో చేసే ఆసక్తి, బడ్జెట్ ఉన్నా కూడ సంవత్సరాల తరబడి చూసుకోకుండా వేరే హీరోలను వెతుక్కుంటూ పోతున్నారు.  దీన్ని పసిగట్టిన ప్రభాస్ ఇప్పుడు తన డేట్స్ పట్టుకున్న దర్శకులంతా వీలైనంత త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని అల్టిమేట్ జారీ చేశారట.