ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు సూపర్ స్టార్స్?

వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీ గా ఉన్నాడు. చాలా మంది టాప్ తెలుగు డైరెక్టర్స్ ప్రభాస్ తో సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నా…ప్రభాస్ దగ్గర ఖాళి లేదు. ఎలాగో సింగల్ షెడ్యూల్ కాబట్టి మారుతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సందీప్ వంగ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటించే అవకాశం కనిపిస్తుంది.

తమిళ్ స్టార్ హీరో సూర్య, అలాగే మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ప్రభాస్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుంది. ప్రభాస్ తో బాటు లెజెండరీ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.