ప్రబాస్‌తో గోపీచంద్: ఈసారైనా పట్టాలెక్కేనా.?

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని దక్కించుకున్న ప్రబాస్, తన తదుపరి సినిమాలన్నింటినీ అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రబాస్ చేతిలో ఉన్న ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ తదితర సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతుండగా, తాజాగా మరో సినిమాని కూడా ఆ రేంజ్‌లోనే తెరకెక్కించేందుకు ఓ ప్రముఖ టీమ్ రెడీ అవుతోందట.

అయితే, ఈ ప్రాజెక్టులోకి మాస్ హీరో గోపీచంద్ భాగస్వామి కాబోతున్నాడు. గతంలో ప్రబాస్ – గోపీచంద్ కాంబినేషన్‌తో తెరకెక్కిన ‘వర్షం’ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆ కాంబినేషన్ మళ్లీ ఇంతవరకూ సెట్ కాలేదు. కానీ, త్వరలోనే సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గోపీచంద్‌కి అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ ఈ కాంబోని సెట్ చేసేందుకు పావులు కదుపుతున్నాడట. ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే ఈ ప్రాజెక్టు తెరకెక్కించేలా పక్కా స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలోనూ గోపీచంద్ నెగిటివ్ రోల్ పోషించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా, రీసెంట్‌గా గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకి దర్శకుడు. తమన్నా హీరోయిన్‌గా నటించింది.