ప్రభాస్ “రాధే శ్యామ్” ఫస్ట్ టైం టీఆర్పీ ఎంత వచ్చిందో తెలుసా.?

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అందులోని మన తెలుగులో అయితే ఎంతో కాలం నుంచి ఊరిస్తూ వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ వచ్చి డిజాస్టర్ట్ అయ్యిపోయింది.

ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచిన ఈ చిత్రం రీసెంట్ గానే జీ తెలుగు ఛానెల్లో ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది. అయితే స్క్రీన్ పై ఫెయిల్ అయ్యిన ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై అయినా మ్యాజిక్ చేస్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ కూడా అందులోని ఫస్ట్ టైం టెలికాస్ట్ లో కేవలం 8.25 టీఆర్పీ రేటింగ్ మాత్రమే అందుకున్నట్టు తెలుస్తుంది.

దీనితో ఇక్కడ కూడా ఈ సినిమా అంత హిట్టవ్వలేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా జస్టిన్ ప్రభాకరన్ సౌత్ లో పాటలు సమకూర్చాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.