ప్రభాస్ కోసం సింపుల్ గా 500 కోట్లు..ఎక్కువైనా ఓకేనట!

Prabhas S Movie Simple Figure Starts With 500 Cr | Telugu Rajyam

ఇండియన్ సినిమా దగ్గర ఒక బ్రాండ్ గా మారిపోయిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాతో పాన్ ఆసియన్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు. అయితే ఇదిలా ఉండగా తన సినిమాలు ఇపుడు అయితే మినిమమ్ 200 కోట్లకు తక్కువలో ఉండట్లేదు. ఇక ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే” చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మన దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కుతుంది. అయితే దీనిపై ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి నిర్మాత అశ్వనీదత్ ఫస్ట్ ఫిగర్ గా సింపుల్ గా 500 కోట్లు ఫిక్స్ చేశారట. ప్రభాస్ స్టార్డం ని మ్యాచ్ చేసే విజువల్స్ తో ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ ఫిగర్ మున్ముందు పెరిగినా కూడా పెట్టేందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని బట్టి ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు చెప్పేసాడు ఈ కథను కానీ ఆ బడ్జెట్ ని కానీ మొయ్యడం ప్రభాస్ వల్లే అవుతుంది అని అందుకే మొదట ఫిగర్ గా 500 కోట్లు మేకర్స్ ముందే ఫిక్స్ చేశారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles