Radhe Shayam: రాధేశ్యామ్ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదల.. మామూలుగా లేదుగా..?

Radhe Shayam: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

YouTube video player

ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని విడుదల చేశారు చిత్ర బృందం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.