భారీ అప్డేట్ ; “రాధే శ్యామ్” ఇంట్రెస్టింగ్ టీజర్ కి టైం ఫిక్స్.!

పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పూర్తి అయ్యిపోయిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాపై మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రాధే శ్యామ్ టీజర్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ప్రభాస్ బర్త్ డే కి ఈ సూపర్ సర్ప్రైజ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యింది.

ఇక దానికి అనుగుణంగా మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్ తో ఈ అప్డేట్ రివీల్ చేశారు. ఈ టీజర్ ను ప్రభాస్ బర్త్ డే కానుకగా వచ్చే అక్టోబర్ 23 ఉదయం 11 గంటల 16 నిమిషాలు కు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని తెలుస్తోంది. ప్రభాస్ చేస్తున్న విక్రమ్ ఆదిత్య పాత్ర ను డిఫైన్ చేస్తూ అతడెవరో అనే కోణంలో ఉంటుంది అని తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఈ భారీ అప్డేట్ ఎట్టకేలకు ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చేస్తోంది.