Prabhas Producer : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు భారతదేశం లో అనన్య సామాన్యం. అందుకే ఈ స్టార్డంని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఎందరో బడా నిర్మాతలు వేలాది కోట్ల రూపాయల తో ఉబలాట పడుతున్నారు. మరి ఇదిలా వుండగా ప్రభాస్ ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో రెండు ఆల్రెడీ కంప్లీట్ కూడా అయ్యాయి.
అయితే ఇదిలా ఉండగా బాలన్స్ ఉన్న చిత్రాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేస్తున్న భారీ సినిమా మాత్రం “ప్రాజెక్ట్ కే” దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఒక స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా దీన్ని ప్లాన్ చేసారు. మరి ఈ సినిమా నిర్మాతనే ప్రభాస్ పై చేసిన సంచలనాత్మక కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ని నాగి చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడని అలాంటి సబ్జెక్ట్ ని ప్రభాస్ మాత్రమే చెయ్యగలడని మరి ప్రభాస్ కి ఇప్పటి వరకు హాలీవుడ్ ఆఫర్స్ రావడం కానీ ఇప్పటి వరకు ఎవరైనా హాలీవుడ్ దర్శకులు, హాలీవుడ్ నిర్మాతలు ఒక ఇండియన్ హీరోతో సినిమాలు చెయ్యాలి అనుకోని ఉండరు కానీ ఈ ప్రాజెక్ట్ కే తర్వాత ప్రభాస్ ఇక మీదట అన్ని సినిమాలు కేవలం హాలీవుడ్ లోనే చేసినా ఆశ్చర్యం లేదని నిర్మాత అశ్విని దత్ ఊహించని కామెంట్స్ చేశారు.
అంటే ఈ లెక్కన వారి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమాకి నిర్మాత మినిమం బడ్జెట్ గా 500 కోట్లు కేటాయించారు. ఇక మాగ్జిమం ఎంతో ఎవరికీ తెలియదు. మొత్తమ్మీద అయితే ఈయన ప్రభాస్ క్రేజ్ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి.