Prabhas : బిగ్ అప్డేట్ : “స్పిరిట్” లో ప్రభాస్ ఈ అదిరిపోయే పాత్ర.. ఫ్యాన్స్ కి పూనకాలే!

Prabhas :  పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఒక బ్రాండ్ లా మారిపోయిన బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా సైన్ చేసాడు అంటే దర్శకుడు ఎవరు అనేది అనవసరం, అది అతడి పేరు వల్ల పాన్ ఇండియన్ సినిమా అయ్యే పరిస్థితి. అయితే ఇదే ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.

ఉంటే అన్ని ప్రపంచ స్థాయిలో లేకపోతే పాన్ ఆసియన్ స్థాయిలోనే సినిమాలు ఉన్నాయి. మరి ఈ భారీ సినిమాల్లో మొట్టమొదటి పాన్ ఆసియన్ లెవెల్లో అనౌన్స్ కాబడిన సినిమా మాత్రం “స్పిరిట్”. డైనమిక్ దర్శకుడు సందీప్ వంగ తో అనౌన్స్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ అప్పుడు నుంచే ఎనలేని హైప్ ని సంతరించుకుంది.

ఇక అక్కడ నుంచి ఎన్నో ఊహాగానాలు ఈ సినిమాపై వినిపించగా ఇప్పుడు ఈ సినిమాలో అసలు ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ తన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ రోల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట.

అది కూడా యూనివర్సల్ కాప్ గా పీరియాడిక్ డ్రాప్ లోనే ఉండనున్నట్టు టాక్. కూడా పక్కన పెడితే ప్రభాస్ మాత్రం ఈ సినిమాలో పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో కనిపించడం ఖాయం అట ఇందులో డౌట్ లేదు. ప్రభాస్ ని పోలీస్ పాత్రలో చూడాలని అభిమానుల్లో ఎప్పుడు నుంచో ఉన్న కోరిక ఫైనల్ గా అది ఇప్పుడు తీరుతుంది.