Radhe Shyam : “రాధే శ్యామ్” సినిమాలు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో ఓపెన్ అయ్యిన ప్రభాస్.!

Radhe Shyam : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మరి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ట్రాక్ తప్పాడు.
దీనితో ఇప్పుడు ప్రభాస్ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ కి బాగా దెబ్బ కొట్టిన సినిమా “రాధే శ్యామ్”.
లాస్ట్ టైం యంగ్ దర్శకుడు సుజీత్ తో “సాహో” తర్వాత మళ్ళీ అదే నిర్మాణ సంస్థ మరియు మరో యంగ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో చేసాడు.
అయితే దీనికి కూడా ప్రభాస్ బ్రాండ్ తో పాన్ ఇండియా లెవెల్ అపీల్ వచ్చింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషం లో ఈ సినిమాకి దెబ్బ పడింది.
అయితే అసలు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఎందుకు చేసాడో రివీల్ చేసాడు. రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాతో సినిమాపై అలాగే సినిమా ఫలితంపై మాట్లాడుతూ నేను కొత్తగా ట్రై చేద్దామని చూసాను నాకు రాధ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది అని.
నా పాత్ర ఒక జ్యోతిష్కుడు కావడం ఇలాంటిది నేను ఎప్పుడు చెయ్యకపోవడం పైగా ప్రేమకి విధికి యుద్ధం అనే అంశం నాకు బాగా నచ్చడంతో ఈ సినిమాకి ఓకే చెప్పానని కానీ సినిమా ఆడియెన్స్ కి నా నుంచి లవ్ స్టోరీ వచ్చిందనో ఎందుకో వాళ్ళకి అయితే నచ్చలేదు నేను మాత్రం కొత్తదనంతోనే ట్రై చేస్తానని ప్రభాస్ తెలిపాడు.