రికార్డ్ రెమ్యునరేషన్ తో ఇండియాలో ఓన్లీ 1 మాన్స్టర్ గా ప్రభాస్..!

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఫేట్ పాన్ ఇండియన్ లెవెల్లో ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ఇచ్చిన ఫేమ్ నుంచి దానిని ఎలా కాపాడుకుంటూ వెళ్ళాలి అనేది ప్రభాస్ ఛాయిస్ నే.. కానీ దానిని ప్రభాస్ చక్కగా వినియోగించుకొని ఒకదాన్ని మించి ఓ సినిమాతో అదిరే లైనప్ ని సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు.

అలా ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్ కి ఎదిగిన ప్రభాస్ టోటల్ ఇండియా లోనే పవర్ ఫుల్ హీరోగా మారిపోయాడు. మొత్తం ఇండియాలో ఏ హీరోకి ఏ ఇండస్ట్రీలో లేని రికార్డు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. తాను పారితోషకంగా ఎంత అందుకుంటున్నాడంటే ఏకంగా ఒక్కో సినిమాకి 150 కోట్లు అట.

అంటే ఓ పాన్ ఇండియన్ సినిమా బడ్జెట్ ని ప్రభాస్ కి రెమ్యునరేషన్ గా ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ వర్గాలే వెల్లడించాయి. అంటే దీనిని బట్టి ఇండియన్ సినిమా దగ్గర ప్రభాస్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.