ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ.. దర్శకుడే నోరు విప్పాడు

Prabhas not doing any hollywood project

Prabhas not doing any hollywood project

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే. ఒక్కో సినిమాకు దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉంటోంది. దేశంలో ఏ హీరోకూ దక్కని స్టార్ స్టేటస్ ఇది. అందుకే ప్రభాస్ మీద నిత్యం ఏదో ఒక రూపంలో గాసిప్స్ వినబడుతూనే ఉన్నాయి. ప్రభాస్ త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా వార్తలు వినిపించాయి. అది కూడ తాం క్రూజ్ సినిమాతో అంటూ గట్టిగా ప్రచారం జరిగింది.

టామ్ క్రూజ్ నటిస్తున్న మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడని, కథా చర్చలు ముగిశాయని, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ ప్రభాస్ ను కలిసి అన్నీ మాట్లాడేశారని పెద్ద కథే చక్కర్లు కొట్టింది. ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులంతా ఎగ్జైట్ అయ్యారు. తీరా క్రిస్టోఫర్ మెక్ క్వారీ స్పందించి క్లారిటీ ఇచ్చే సరికి అపోహలన్నీ తొలగిపోయాయి. తాను ఎవరికీ కథ చెప్పలేదని తేల్చేసిన క్రిస్టోఫర్ ప్రభాస్ ప్రతిభావంతుడని అన్నారు. సాధారణంగా హాలీవుడ్ దర్శకులు ఇలాంటి రూమర్ల మీద అస్సలు రెస్పాండ్ కారు. కానీ ఈసారి రూమర్లో ప్రభాస్ పేరు ఉండేసరికి రెస్పాండ్ అయ్యారు క్రిస్టోఫర్ మెక్ క్వారీ. ఇది కూడ ఒకరకంగా విశేషమే.