ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్”లో ప్రభాస్ ని చూస్తే దిమ్మ తిరగాల్సిందేనా.!

 Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో కొన్ని డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ హిస్టారికల్ విజువల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలుసు.
అలాగే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ జానకీ దేవి గా నటించారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో తన లుక్ కి సంబంధించి బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ని ఏకంగా 8 అడుగులు ఉండేలా చూపిస్తారట.
శ్రీరాముడు నిజంగానే అంత ఉండేవాడని నానుడి మాత్రమే కాకుండా వాల్మీకి రామాయణంలో కూడా కొన్ని వేదాల ఆధారంగా లిఖితం అయ్యి ఉందని అందుకే ప్రభాస్ పత్రానికి కూడా 8 అడుగులు ఉండేలా తీర్చి దిద్దారని రేపు సినిమాలో చూస్తారని బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన టాక్.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందో కానీ సరిగా ముందు కూడా సైఫ్ అలీఖాన్ పాత్రపై కూడా ఇలాంటి వార్తలే అప్పుడు వచ్చాయి. రావణ్ గా సైఫ్ ని 7 అడుగుల్లో చూపిస్తారని టాక్ ఆ మధ్య వచ్చింది. అంటే ఈ ప్రభాస్ పై వార్తలు కూడా నిజం కావచ్చు..