లీక్ : ప్రభాస్ “సలార్” నుంచి కొత్త లీక్.. డార్లింగ్ లుక్ తేడాగా ఉందే..!

ఇటీవల మన టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ భారీ సినిమాలుకు సంబంధించి అనేక లీక్స్ చూస్తూనే ఉన్నాము. ఆల్ మోస్ట్ ఇప్పుడు సెట్స్ పై ఉన్న 90 శాతంకి కి పైగా లీక్స్ బారిన పడ్డాయి. అయితే సెట్స్ నుంచి హీరోల లుక్ లీక్ అయ్యిపోవడం గాని అలాగే లేదా ఏకంగా వీడియోలు వచ్చేయడం గాని జరిగాయి.

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సలార్” కి కూడా లీక్ లు తప్పలేదు. అయితే స్టార్టింగ్ లో వచ్చిన లీక్స్ కన్నా ఇప్పుడు వచ్చిన లీక్ లో ప్రభాస్ లుక్ ని చూసి కాస్త అభిమానులు కంగారు పడుతున్నారు. మొదట్లో ప్రభాస్ బాడీ గాని పేస్ గాని కాస్త బ్యాలన్స్డ్ గా కనిపించాయి.

కానీ ఇప్పుడు చూస్తే అదే అవుట్ లుక్ లో కనిపిస్తున్నాడు కానీ ఫస్ట్ లుక్ కి దీనికి లుక్ చాలా మారిపోయింది. అందులో యంగ్ గా కనిపిస్తే ఇందులో కాస్త ఏజ్డ్ గా కనిపిస్తున్నాడు. ఏజ్డ్ అంటే మళ్ళీ రెండో రోల్ అనుకునేరు అది కాదు సెకండ్ లుక్ గా రిలీజ్ చేసిన దాంట్లో మళ్ళీ ప్రభాస్ ఆకృతి మారిపోయింది.

అయితే ఇది లీక్ స్టిల్ లో అనుకోవచ్చు కానీ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ లీక్ అభిమానుల్లో వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే హోంబళే ఫిలిమ్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు.