Kalki2: కల్కి సినిమాకు ఏడాది.. పార్ట్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Kalki2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ కల్కి. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది సరిగ్గా ఇదే రోజు విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మైథలాజికల్ సినిమా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇది అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పార్ట్ 2 కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో నిర్మాత అశ్వనీదత్ కల్కి2పై అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కల్కి2 షూటింగ్‌ మొదలు కానుందని నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు.

వచ్చే ఏడాది మే లేదా జూన్‌ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను కల్కి 2 కనువిందు చేయనుందని అశ్వనీదత్‌ అన్నారు. ఈ సందర్బంగా అశ్వనీదత్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.