ప్రభాస్, మారుతీ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో

బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు ప్రభాస్ ఒక స్మాల్ బడ్జెట్ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతి డైరెక్ట్ చేసే ఈ సినిమా ఒక హారర్ కామెడీ అని తెలుస్తుంది. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా పలు భారీ యాక్షన్ సీన్స్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ మధ్యే ‘కెజిఫ్’ సెకండ్ పార్ట్ లో అదిరా గా సంజయ్ దత్ మెప్పించాడు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ మూవీ లో విలన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ లో హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో పవర్ఫుల్ గా ఉంటుందట. కాగా ఈ క్రేజీ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ఆఫిసిఅల్ గా మూవీ టీం అప్డేట్ ఇస్తుంది.