మొదటి సారి అలాంటి పాత్రలో ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నా…ప్రభాస్ మాత్రం కొత్త దర్శకుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. ప్రశాంత్ నీల్ తప్ప మిగతా డైరెక్టర్స్ కి ఆంధ్ క్రెడిబిలిటీ లేదు.

ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ త్వరలో శాండీ వంగ ‘స్పిరిట్’ సినిమా కూడా స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈ మధ్యలో మారుతీ తో సినిమా చెయ్యడానికి రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాని కేవలం రెండే రెండు షెడ్యూల్స్ లో ముగించి ఆ పై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వెళదామని ప్రభాస్ ఆలోచిస్తున్నట్టు తెలుసుతుంది.

అయితే ఈ మధ్యే మారుతి సినిమా ‘పక్క కమర్షియల్’ పెద్ద ప్లాప్ అయింది. దీని వల్ల ప్రభాస్ ఫాన్స్ మారుతి తో సినిమా చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ, ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో పక్కాగా సాగే థ్రిల్లింగ్ కమర్షియల్ జానర్ మూవీ స్టోరీని సిద్ధం చేశారట. కొంచెం కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు హర్రర్ కూడా ఈ మూవీలో ఉంటుందని తెలుస్తుంది.

అయితే మొదటిసారి ఈ మూవీలో ప్రభాస్ తాత, మనవడు లా డ్యూయల్ రోల్ చేయనున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా రెండు పాత్రలు సినిమాలో మంచి ప్రాధాన్యత కలిగినవని అంటున్నారు. కాగా ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పెట్టనున్నారు అనే న్యూస్ కూడా ప్రచారం లో ఉంది.