పాన్ ఇండియన్ సినిమా వద్ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో “ఆదిపురుష్”, “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాలతో పాటుగా వాటికి మించిన హై బడ్జెట్ తో మరిన్ని సినిమాలు చేస్తున్నాడు. అయితే వీటిలో రీసెంట్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఓ పాన్ ఆసియా సినిమా “స్పిరిట్” ని అనౌన్స్ చేసి సంచలనం నమోదు చేసాడు.
అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఈ నాలుగు భారీ చిత్రాల్లో ఆదిపురుష్, స్పిరిట్ చిత్రాలకు ఒకే మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం అయితే ఈ రెండు సినిమాలకి కలిపి 300 కోట్లు ప్రభాస్ తీసుకుంటున్నాడట. అంటే ఒక్కో సినిమాకి ఏకంగా 150 కోట్లు రెమ్యునరేషన్ అట. ఇక ఈ లెక్క మున్ముందు మరింత ఎక్కువైనా ఆశ్చర్యం లేదని కూడా చెప్పాలి.