విక్రమ్ “కేజీఎఫ్” కోసం ప్రభాస్ హాట్ హీరోయిన్..?

సౌత్ ఇండియా సినిమా ఇప్పుడు భారీ స్థాయిలో షైన్ అవుతుంది. మరి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అయితే భారీ వసూళ్లు అందుకున్న ఏ సినిమా చూసినా కూడా ఏదొక హిస్టారికల్ టచ్ అయితే కనిపిస్తుంది. అలాంటి చిత్రాల్లో కన్నడ భారీ హిట్ సినిమా కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కూడా ఒకటి.

మరి ఈ ఫ్రాంచైజ్ మంచి హిట్ అయ్యింది అక్కడితో అయిపొయింది అనుకుంటే మళ్ళీ ఇదే కన్నడ నుంచి దాదాపు దీని లాంటి విజువల్స్ తోనే మరో సినిమా “కబ్జా” ని వేరే మేకర్స్ స్టార్ హీరో నమ్మ ఉపేంద్ర తో తెరకెక్కించారు. అయితే ఇది చాలదు అన్నట్టు మళ్ళీ ఇదే కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో తమిళ్ నుంచి స్టార్ హీరో విక్రమ్ తో అయితే ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సినిమా ఓకే చేసాడు.

అయితే పా రంజిత్ వరకు చాలా నమ్మకం పెట్టుకోవచ్చు కానీ ఎక్కడో చిన్న సందేహం మాత్రం లేకపోలేదు. ఇక ఇది పక్కన పెడితే మిగతా విషయాలు అన్నీ చక చకా అయిపోతున్నాయట. అందులో భాగంగా తమిళ్ హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఫిక్స్ అయ్యిందట.

దీనితో ఈ వార్తా సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. మరి ఈ హిట్ బ్యూటీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో కూడా ముందే లాక్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పుడు ఈమె అయితే ప్రభాస్ విక్రమ్ సినిమాలతో బిజీగా ఉంది.