Prabhas : తీవ్రంగా నష్టపోతున్న ప్రబాస్: మేల్కొనకపోతే అడ్రస్ గల్లంతే.!

Prabhas : ప్రబాస్‌ని కేవలం ఆయన అభిమానులే కాదు, అందరూ ముద్దుగా ‘డార్లింగ్’ అని పిలుచుకుంటుంటారు. ‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని డార్లింగ్ కాస్తా ‘ప్యాన్ ఇండియా స్టార్’ హోదా దక్కించుకున్నాడు ప్రబాస్. ప్రబాస్ కెరీర్‌లోనే ఊహించిన స్థార్‌డమ్ బాహుబలి ద్వారా దక్కింది ప్రబాస్‌కి బాగానే వుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ ఇంకో సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్లు పైనే పట్టేసింది. అదే ‘సాహో’ సినిమా. నిజానికి ఆ స్థాయి గుర్తింపు వచ్చేశాకా, ఎలాంటి సినిమా చేయాలో తెలియని డైలమాలో పడిపోయాడు ప్రబాస్. అదే తదుపరి సినిమా అంత ఆలస్యమవడానికి కారణం.

ఇక ఇప్పుడు, ‘రాధేశ్యామ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. అయితే, కరోనా మహమ్మారి రూపంలో ఈ సినిమాకీ ఎక్కువే గ్యాప్ వచ్చేసింది. అది కూడా దాదాపు మూడున్నరేళ్లు. సరే, రాక రాక ప్రబాస్ నుంచి సినిమా వచ్చింది.

ప్రబాస్ సినిమా అంటే ఏ స్థాయి అంచనాలుంటాయో చెప్పక్కర్లేదు. కానీ, ఆ స్థాయి అంచనాల్ని ‘రాధేశ్యామ్’ అందుకోగలిగిందా.? సినిమా చూశాకా, దారుణంగా తిడుతున్నారు. సినిమాని తమ భుజాలపై మోయాల్సిన ప్రబాస్ ఫ్యాన్సే ‘రాధేశ్యామ్’ రిజల్ట్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘సాహో’ని ఎలాగో లాక్కొచ్చేశారు. యాక్షన్ సీన్స్ కోసమో, విజువల్స్ కోసమో.. వేరే ఇతరత్రా కారణాలేమైనా కావచ్చు. కానీ, ఇన్నాళ్లు ఎదురు చూసీ, చూసీ, ఇప్పుడు కూడా తమ అభిమాన హీరో నుంచి అదే డిజప్పాయింట్‌మెంట్. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

అవును మరి, ఏకంగా మూడేసి, నాలుగేసేళ్లు అభిమానులు ఎదురు చూడడం అనేది చిన్న విషయం కాదుగా. ప్రయోగాలు చేయొచ్చు. కానీ, ఆ ప్రయోగాలు కనీసం ఫ్యాన్స్‌నైనా ఆకట్టుకునేలా వుండాలి కదా. ఇట్టయితే ఎట్టా డార్లింగా.. బొత్తిగా బాధ్యత వుండక్కర్లా.!