మరో క్రేజీ సినిమా కి రెడీ అవుతున్న ప్రభాస్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ తాజాగా మరో సినిమాకి సైన్ చేసాడు. కానీ ఈ సారి మాత్రం తెలుగు లో మారుతి దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ‘రాజా డీలక్స్’ అని మొదట్లో ఈ సినిమా టైటిల్ అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా టైటిల్ మారినట్టు తెలుస్తుంది.
హారర్ కామెడీ కాకుండా ఈ సినిమా డైమండ్ హంట్ లా ఉంటుందని తెలుస్తుంది. ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో ఓ చిన్న షెడ్యూల్ జరగనుందని ఇప్పుడు టాక్.
ఈ మూవీ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.