Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నారు.
ఇక ప్రభాస్ అంటే అభిమానించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులను ప్రభాస్ సొంతం చేసుకున్నారు. మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకి కూడా ఫేవరెట్ హీరోలు ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ పాన్ ఇండియా స్టార్ ఫేవరెట్ హీరోలు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.. ప్రభాస్ ఒక హీరోని కాకుండా ఏకంగా ముగ్గురు హీరోలు తనకు ఫేవరెట్ హీరోలని తెలియజేశారు.
ఈయనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టమని ఆయన తన ఫేవరెట్ హీరో అని తెలియజేశారు. ఇక తెలుగులోపాటు తమిళంలో కూడా తనకు మరొక ఫేవరెట్ హీరో ఉన్నారని సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పేరు తెలిపారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ అంటే కూడా చాలా ఇష్టం అంటూ ప్రభాస్ తనకి ఇష్టమైన ముగ్గురు హీరోల పేర్లను బయటపెట్టారు. ఇలా ఈ ముగ్గురు అంటే తనకు చాలా ఇష్టమని వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలతో రజనీకాంత్ చిరు అమితాబ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈయన త్వరలోనే ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.