థియేటర్ వద్ద అపశృతి.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు

ప్రభాస్ “రాధేశ్యామ్” థియేటర్లలో సందడి చేయస్తోంది. సినిమా హల్స్ వద్ద ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. మూడేళ్ళ తరువాత ప్రభాస్ సినిమా విడుదల కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే మరో ఇద్దరికి కూడా గాయాలైనట్టు సమాచారం. వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.