“ఆదిపురుష్” అప్డేట్ కోసం నేషనల్ లెవెల్లో రచ్చ లేపుతున్న ఫ్యాన్స్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అయినటువంటి “ఆదిపురుష్” కూడా ఒకటి. హిందీ సినిమా తానాజీ ఫేమ్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. అలాగే కృతి సనన్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు నుంచో బాగా డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారని చెప్పాలి. ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా ప్రతి దాని నుంచి ఇప్పుడు ఏదొక మేజర్ అప్డేట్ వస్తున్నా ఈ సినిమా విషయంలో మాత్రం ఏ అప్డేట్ లేదు. జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ తప్ప ఏది బిగ్ అప్డేట్ లేదు.

దీనితో తమకి ఒక అప్డేట్ కావాలని ఆదిపురుష్ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఏకంగా నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. #WakeUpTeamADIPURUSH అంటూ ఒక ట్యాగ్ తో ఇండియా ట్రెండ్స్ లో తమ అప్డేట్ కోసం చిత్ర యూనిట్ పై ఒత్తిడి పెడుతున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ అని చెప్పాలి.

ఒకవేళ ఇప్పుడే గని చిత్ర యూనిట్ అలర్ట్ కాకపోతే ముందు రోజుల్లో అంతకు మించి నెగిటివ్ ట్రెండ్ లు ఉంటాయి. ఇదివరకు చాలా సినిమాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ చేసి చూపించారు. మరి అంత వరకు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఏదొక అప్డేట్ ని మేకర్స్ ఇవ్వాల్సిందే..