Prabhas Fans : షాకింగ్ : ప్రభాస్ ఫ్యాన్స్ ని అవమానిస్తున్న అతడి పేరుతో ఎదిగిన నటుడు.?

Prabhas Fans : సాధారణంగా కొందరు నటులు(క్యారెక్టర్ ఆర్టిస్ట్స్) ఓ సినిమాతో కానీ ఆ సినిమాలో హీరో వల్ల కానీ చాలా ఫేమస్ అవుతూ ఉంటారు. అలానే వారికి పేరు కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అయితే ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వల్ల పేరు వచ్చిన నటులు కొంతమంది ఉన్నారు.

కానీ తన పేరు లోనే ప్రభాస్ పేరు పెట్టుకొని ఇండస్ట్రీ లో నటుడు గా చలామణి అవుతున్న నటుడు మాత్రం ఒకతను ఉన్నాడు. అయితే అతడిపై అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఒక రచ్చ ఇప్పుడు నడుస్తుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరో అతడి నెంబర్ సంపాదించి ఎలాగో కాల్ చెయ్యగా ఈ నటుడు మాత్రం వారితో చాలా దుర్భాషలాడాడట.

దీనితో ఆ నటుడు విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభాస్ పేరు వల్ల ఇమేజ్ వల్ల టాలీవుడ్ లో ఎదిగి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నే బండ బూతులు తిట్టడం ఏమిటని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది చిన్న విషయం ఏమి కాదు చాలా సీరియస్ గానే ఈ విషయంలో వారు మాట్లాడుకుంటున్నారు.

అంతే కాకుండా ఇలాంటి వాళ్ళ కోసం ప్రభాస్ దృష్టికి కూడా ఎలా అయినా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ ఫాన్స్ మధ్య ఈ అంశం మాత్రం మంచి గరంగరంగా నడుస్తుంది. మరి వారేం చేస్తారో చూడాలి.