103 రోజుల మహా యాగం కంప్లీట్ చేసిన ప్రభాస్.!

పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ నుంచి పాన్ ఆసియన్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో మన దేశపు ఇతిహాస చరిత్ర రామాయణం ఆధారంగా చేసిన సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో ప్రభాస్ రామునిగా నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం షూటింగ్ ని ఎట్టకేలకు కంప్లీట్ చేసినట్టుగా దర్శకుడు ఇప్పుడు బిగ్ అప్డేట్ ఇచ్చాడు.

హిందీ మరియు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొత్తం 103 రోజుల షూట్ మహా యాగాన్ని ప్రభాస్ ఇప్పుడు కంప్లీట్ చేసాడు. మొత్తం సినిమా కీలక నటులు కూడా ఈ సినిమా కంప్లీషన్ లో పాల్గొన్నారు. సీతగా నటించిన కృతి సనన్, లంకేశుని పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ లతో దర్శకుడు ఫోటో షేర్ చేసుకున్నాడు. మరి 3డి లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న రిలీజ్ కానుంది.