Chiranjeevi – Prabhas: చిరంజీవి వద్దన్న కథకు ఓకే చెప్పిన ప్రభాస్..?

Chiranjeevi – Prabhas: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో చేయడం అన్నది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కొన్ని కొన్ని కథలు కొంతమంది హీరోలకు నచ్చచ్చు, లేదంటే నచ్చకపోవచ్చు. ఇప్పటికే ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన కథ ప్రభాస్ కు నచ్చి ఓకే చెప్పాడు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే కథకు అల్లు అర్జున్ కూడా నో చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ అనే ఓ సినిమా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా గురించి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ ఇప్పటివరకు రాలేదు. అయినా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఇక దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ తో కలిసి ఆ సినిమాను చేయనున్నాడు. ఇక ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో, తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అయితే వరుసగా భారీ బడ్జెట్ లతో పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ కాస్త రిలీఫ్ కోసం కామెడీ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఆ ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి పక్కన పెడితే ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్ లోపే పూర్తి కానుందని సమాచారం.

ఈ మధ్యకాలంలో భారీ సినిమాలతో యాక్షన్ జోనర్ లో ఇరుక్కుపోయిన ప్రభాస్ అందులో నుంచి బయటికి రావడానికి మారుతి కామెడీ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నాడు. అయితే దర్శకుడు మారుతి ఇదివరకే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలలో బాగానే కామెడీ ట్రై చేశారు. ఆ సినిమాలలో క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయినప్పటికీ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ సారి అయినా దర్శకుడు మారుతి మంచి విజయాన్ని అందుకు ఉంటాడో లేదో చూడాలి మరి.